30-08-2025 12:18:17 AM
కరీంనగర్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ 15 వ వర్ధంతి శుక్రవారం నిర్వహించారు. కరీంనగర్ లోని పొన్నం సత్తయ్య గౌడ్ ఘాట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్ర గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం,విజయరమణ రావు,ముఖ్య నాయకులు, అధికారులు, తదితరులుపాల్గొన్నారు.