30-08-2025 12:18:06 AM
హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీపీఐ నేత డి.రాజా
ఖైరతాబాద్;ఆగస్టు 29 (విజయక్రాంతి) : సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హిమాచల్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సిపిఐ(ఎం) పోలిట్ సభ్యులు బి.వి.రాఘవులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ బిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల, వామపక్ష పార్టీల నాయకులు, మేధావులు హాజరు కానున్నారని తెలిపారు. సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, సురవరం సుధాకర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.