05-07-2025 07:45:18 PM
సిద్దిపేట రూరల్ (విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలం చింతమడక, చిన్నకోడూరు మండలం గుర్రాల గొంది, కొండపాక మండలంలోని దుద్దెడ, కొండపాక, చేర్యాల, వర్గల్, దుబ్బాక ఇలా సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ హైమావతి(District Collector Hymavathi) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మొదటిసారి అన్ని పాఠశాలలను సందర్శించి తగు సూచనలు సలహాలు చేశారు. మరోసారి అకస్మికంగా తనిఖీలు చేస్తామని చెప్పారు.