05-07-2025 07:49:04 PM
ఘట్ కేసర్: ఘట్ కేసర్ లో నివాసం ఉంటూ ఉప్పల్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న గుంట రమేష్ ఇటీవల ఆర్ధిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్త చనిపోయి ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న కారణంగా అతని భార్య అర్చన ఆర్ధిక సహాయం కోసం సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్(Sunrise Charitable Trust)ను సంప్రదించారు. దీంతో వారికి శనివారం ట్రస్ట్ తరపున పిల్లల భవిష్యత్ నిమిత్తం రూ. 20,000 తో పోస్ట్ ఆఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వై. సుందర రావు, ఎం. శ్రీకాంత్, ఎ. వీరారెడ్డి, జి. బంగారుబాబు, ఎన్. రామయ్య, బి. సోమయ్య, కొమ్మ గోని రమాదేవి మహిపాల్ గౌడ్ (మాజీ కౌన్సిలర్), ఎస్. గీత టీచర్సిహెచ్. హేమలత టీచర్, సిహెచ్. సంతోష్, ఎ. సత్యం పాల్గొన్నారు.