calender_icon.png 6 July, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి

05-07-2025 07:49:52 PM

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్లీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు.  శనివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మణికంఠ రెడ్డి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తాము అధికారంలోకి వస్తే ఒకేసారి విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పి నేడు అధికారంలో వచ్చి 18 నెలలు కావస్తా ఉన్నా ఫీజు బకాయిల విడుదలపై  నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.

అన్ని బకాయిలను విడుదల చేస్తున్నామని చెప్పే ప్రభుత్వం 8000కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని, కొన్ని కార్పొరేట్ కళాశాలలకు అనుగుణంగా ఫీజు బకాయిలు విడుదల చేయకుండా వారు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు.