దేశంలో తగ్గిన హిందువుల శాతం

10-05-2024 01:24:11 AM

65 ఏళ్లలో 7.82%

౮౪.౬౮ శాతం నుంచి ౭౯.౦౬ శాతానికి

ముస్లింల జనాభా౪౩.౧౫ శాతం పెరుగుదల

భారత పొరుగు దేశాల్లోనూ ఇదే ట్రెండ్

పీఎం ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో వెల్లడి 

న్యూఢిల్లీ, మే 9: దేశంలో గత ఆరు దశాబ్దాల్లో హిందువుల జనాభా శాతం భారీగా తగ్గిందని తాజా గణాంకాల్లో తేలింది. అదే సమయంలో ముస్లింలు, ఇతర మైనార్టీల జనాభా శాతం పెరిగిందని వెల్లడయ్యింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మతపరమైన మైనారిటీల వాటా దేశాల్లో పరిశోధన (1950  పేరిట విడుదల చేసిన నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. 1950 మధ్య మొత్తం 167 దేశాల్లో మతపరమైన జనాభాలో వచ్చిన మార్పులను ఈ పరిశోధన వివరించింది.

భారత్‌లోని హిందువుల జనాభా శాతం తగ్గుతోందని, మైనారిటీల శాతం పెరుగుతోందని తెలిపింది. దేశం మొత్తం జనాభాలో 1950 మధ్య 65 ఏళ్లలో హిందువుల జనాభా 7.82 శాతం క్షీణించింది. మయన్మార్ (10 శాతం) తర్వాత ఇదే అధికం. 1950లో హిందువుల జనాభా 84.68 శాతం ఉండగా, 2015 నాటికి 78.06 శాతానికి పడిపోయిందని వెల్లడైంది.

ఇదే కాలంలో ముస్లిం జనాభాలో 43.15 శాతం పెరుగుదల కనిపించింది. 1950లో 9.84 శాతం ఉన్న ముస్లిం జనాభా, 2015 నాటికి 14.09 శాతానికి పెరిగింది. క్రైస్తవుల జనాభాలో 2.24 శాతం నుంచి 2.36 శాతానికి స్పల్పంగా పెరుగుదల నమోదైంది. రిలీజియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేట్స్ డాటాసెట్ (ఆర్‌సీఎస్ ఆధారంగా శమికా రవి, అపూర్వకుమార్ మిశ్ర, అబ్రహం జోస్ ఈ అధ్యయనం నిర్వహించారు. 

భారత్ పొరుగు దేశాల్లోనూ..

ఈ అధ్యయనం ప్రకారం.. 167 దేశాల్లో 1950 నాటి లెక్కల ప్రకారం మెజారిటీ మత సమూహ జనాభా 75 శాతంగా ఉంది.  2015లో ఇది 22 శాతం తగ్గింది. ఈ ధోరణి ఆఫ్రికా దేశాల్లో అధికంగా కనిపిస్తోంది. క్రైస్తవ మెజారిటీ దేశాలు మాత్రం సాధారణ క్షీణతను చూశాయి. మొత్తం 94 క్రైస్తవ మెజారిటీ దేశాల్లో 77 మాత్రమే తగ్గుదలను నమోదు చేశాయి. దీనికి విరుద్ధంగా ముస్లిం మెజారిటీ దేశాలు ఆధిపత్య మత జనాభాలో అధిక వృద్ధిని సాధించాయి.

భారత్ పొరుగుదేశాలైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఈ పరిస్థితిని గమనించవచ్చు. భారత్‌లో జైనులు, పార్శీలు మినహా అన్ని మైనారిటీ వర్గాల జనాభాలో పెరుగుదల నమోదైంది. భారత్‌కు ముస్లిమేతర పొరుగుదేశాలైన మయన్మార్, నేపాల్‌లోనూ మెజారిటీ మత జనాభా క్షీణిస్తూ వచ్చింది. మయన్మార్‌లో ఈ తగ్గుదల అధికంగా ఉంది. 

1950 మధ్య వివిధ దేశాల్లో మతపరమైన జనాభా శాతాల్లో..

దేశం ప్రధాన మతం 1950(శాతంలో) 2015(శాతంలో)

భారత్ హిందూ 84.68 78.06

పాకిస్థాన్ ఇస్లాం 77.45 80.36

శ్రీలంక బౌద్ధం 64.28 67.65

బంగ్లాదేశ్ ఇస్లాం 74.24 88.02

నేపాల్ హిందూ 84.30 81.26

చైనా చైనీస్ ఫోక్ 51.50 21.01

భూటాన్ టిబెటన్ బౌద్ధం 71.44 84.07

ఆఫ్గనిస్థాన్ ఇస్లాం 88.75 89.01

మాల్దీవులు ఇస్లాం 99.83 98.36