23-09-2025 12:03:48 AM
-వామన్‌రావు దంపతుల హత్య కేసులో సీబీఐ దూకుడు
-కుటుంబ సభ్యుల వాంగ్మూలం రికార్డు
-పోలీసుల సహకారం లేకుండా దర్యాప్తు
-సరైన ఆధారాలు లభిస్తే అరెస్టు చేసే అవకాశం
మంథని, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో విచారణ బాధ్యతలు తీసుకున్న సీబీఐ తన దూ కుడును మరింతగా పెంచింది.
పెద్దపల్లి జిల్లా కు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం మొదటి రోజునే మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని వామన్ రావు తండ్రి, సోదరుడిని కలిసి వెంట బెట్టుకొని మంథని కోర్టు ప్రాంగణం, అక్కడ నుంచి హత్య జరిగిన రామగిరి మండలం కల్వచర్ల పరిధిలోని మారుతినగర్ వద్ద గల ప్రధాన రోడ్డు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. రామగుం డం పోలీస్ కమిషనరేట్‌లో విచారణ బృం దానికి ప్రత్యేక గదిని పోలీస్ శాఖ కేటాయించింది.
అయితే స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండానే సీబీఐ బృందం విచారణ జరుపుతుండటం అటు పోలీస్ వర్గాలను కలవరపె డుతోంది. రెండు రోజుల పాటు వామన్‌రావు కుటుంబ సభ్యులను కమిషనరేట్ కా ర్యాలయానికి పిలిపించుకొని రహస్యంగా విచారణ చేసి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న అధికారులు.. వాటిని బయటకు రానీయడం లేదు. కమిషనరేట్ పోలీస్ అధికారులకు కూడా ఎలాంటి సమాచారం చెప్ప డం లేదు. వామన్‌రావు దంపతులను చంపడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది.
హత్య కేసులో పట్టుబడిన నిందితులకు, వామన్‌రావు దంపతులకు వ్యక్తిగత మైన కక్షలు ఏమైనా ఉన్నాయా? భూ తగాదాలు గానీ, ఇతర కేసుల విషయంలో వామ న్ రావు నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేక సూత్రధారుల నుంచి సుపారీ తీసుకుని హత్య చేశారా? సుపారీ తీసుకుంటే ఎవరు ఇచ్చారు? నిందితులతోపాటు వారి బంధువుల బ్యాంక్ ఖాతాలను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ హత్య కేసులో తెరవెనుక సూత్రధారులు ఎవరై ఉంటారని అంతటా సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హత్య జరిగిన సమయంలో వివిధ కోణాల్లో వార్తలు ప్రచురించిన జర్నలిస్టులను కూడా విచారిం చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ హత్య కేసులో ఆధారాలు సీబీఐ చేతికి చిక్కితే సూ త్రధారులను అరెస్టు చేస్తారా? అన్నది చర్చ జరుగుతోంది. వామన్‌రావు కుటుంబ సభ్యు లు మాత్రం నిందితుల కంటే తెరవెనుక ఉండి హత్య చేయించిన సూత్రధారులకే శిక్ష పడాలని సీబీఐ అధికారుల ముందు వాపోయినట్లు తెలిసింది. ఆ ఆరోపణల ఆధారంగా సీబీఐ సాక్షాల కోసం లోతుగా విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.