23-09-2025 12:05:07 AM
-సినీ నటి దివి చేతుల మీదుగా ప్రారంభం
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ నిలయ మెట్రో షాపింగ్‌మాల్‌ని సోమవారం సినీ నటి దివి ప్రారంభించారు. దివిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దివి పలు వస్తారభరణాలు పరిశీలించి వాటిని ప్రదర్శించారు.
హైదరాబాద్ నగరంలో ఉండే వస్త్రభరణాలు సిరిసిల్లలోని మన శ్రీ నిలయ మెట్రో షాపింగ్ మాల్‌లో సరాసమైన ధరలకే లభించడం ఆనందకరమని దివి తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రారంభోత్సవం సందర్భంగా మెట్రో షాపింగ్ మాల్ యాజమాన్యం ఆఫర్లను ప్రకటించడంతో కొనుగోలుదారులు షాపింగ్ మాల్‌ని సందడిగా మార్చారు.