23-09-2025 01:19:09 AM
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గత 20 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి రైతులు భారీ వరదల్లో తమ పంట పొలాలను కోల్పోయి రోడ్డుపై పడ్డారు. భారీగా కురిసిన వర్షానికి వరదల్లో మోటర్లు స్టార్టర్లు పైపులు వారి పైరులు, చెరుకు తోటలు పూర్తిగా కొట్టుకపోవడంతో అన్నదాత ఆగమై రోడ్డుపై బిక్కుబిక్కు మంటున్న ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్న పాపం కరువైంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మంజీరా పరివాహక ప్రాంతాల గ్రామాలకు చెందిన రైతులు సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోనీ, ఎల్లారెడ్డి- హైదరాబాద్ ప్రధాన రహదారి పై రైతుల అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. రైతుల రాస్తారోకోకు మద్దతుగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జ జాజాల సురేందర్ పాల్గొని మద్దతు తెలిపారు. భారీ వర్షాలకు పోటెత్తిన వరదతో వేల ఎకరాల్లో పంటలు ముంపుకు గురై ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎకరాకు 50 వేల నష్టం పరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. రైతులు ప్రధాన రహదారిపై, రాస్తారోకో నిర్వహించి డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ& ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగిరెడ్డిపేట మండలంలో పంటలు, రోడ్లు, పోచారం ప్రాజెక్టు సైతం నష్టం జరిగిందని అన్నారు. భారీగా పంట నష్టం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించకుండా సీఎం రేవంత్ రెడ్డి తాడ్వాయి మండలానికి వచ్చివెళ్ళాడని, విహారయాత్రకు వచ్చి వెళ్లినట్టుగా తన పర్యటన సాగిందని మండిపడ్డారు.
పంట నష్ట పోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఎకరాకు 50,000 చొప్పున అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు ఆర్డిఓ తో మాజీ ఎమ్మెల్యే కు ఫోన్లో మాట్లాడించగా.. వారం రోజుల్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా ఆదుకుంటా మని హామీ ఇవ్వడంతో రాస్తారోకో ని విరమించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు బొల్లి నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసిలు మనోహర్ రెడ్డి, జయరాజ్, మాజీ ఎంపీపీ,రాజదాస్, ముదాం సాయిలు, నాయకులు ఆదిమూలం సతీష్, అరవింద్ గౌడ్, పృథ్వీరాజ్, బిఆర్‌ఎస్ నాయకులు&రైతులు పాల్గొన్నారు.