23-09-2025 12:02:59 AM
10 విడతల్లో తిరిగి వసూలు
హైదరాబాద్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి)ః ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో సర్కార్ కీలక ప్రకటన చేసింది. కార్మికులు, సిబ్బందికి పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ టీజీ ఆర్టీసీ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికి సంబంధించి వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపు చేయాలని సూచించారు. ఈ అడ్వాన్స్‌ను 2025 నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా పది సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పండుగ అడ్వాన్స్ ఇవ్వడంపై ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.