calender_icon.png 12 October, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి

11-10-2025 10:13:21 PM

బలిదుపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు

అడ్డాకుల: మండల పరిధిలోని, బలీదుపల్లి చెక్ డ్యామ్ లో చేపల వేటకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలకు వెళ్తే బలీదుపల్లి గ్రామానికి చెందిన మంద యాదయ్య (కీర్తిశేషులు మంద మన్నెమ్మ నలుగురు కుమారులు) బతుకుదెరువు కోసం హైదరాబాదులో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవారు. వాళ్ళ అమ్మ మంద మన్నెమ్మ మొదటి వర్ధంతికి సొంత గ్రామమైన బలీదుపల్లికి, శుక్రవారం నాడు వచ్చి కార్యక్రమాన్ని చేసుకున్నారు.

శనివారం ప్రాంతంలోని బలీదుపల్లి చెక్ డ్యాంలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మంద సుధాకర్(30), మంద సాయి(23), చెక్ డ్యామ్ లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మంద సుధాకర్ కు ఇద్దరు సంతానం ఉండగా ఒక కుమార్తె ఒక కుమారుడు అతని భార్య మమత శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.