calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీవో మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా దీపారెడ్డి

22-09-2025 01:16:48 AM

-కన్వీనర్‌గా జక్కంపూడి సుజాత 

-ఈనెల 27న టీజీవో భవన్‌లో బతుకమ్మ వేడుకలు

-రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): టీజీవో కేంద్ర సంఘం మహిళా విభాగాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాంపల్లిలోని టీజవో భవన్‌లో గెజిటెడ్ అధికారుల జనరల్ బాడీ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించినట్లు టీజీవోరాష్ట్ర అధక్షులు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.

ఈ సందర్భంగా 103 మంది సభ్యులతో మహిళా విభాగాన్ని ప్రకటించారు. టీజీవో మహిళా విభాగం చైర్‌పర్స్‌న్‌గా డాక్టర్ జీ. దీపారెడ్డి, కన్వీనర్‌గా జక్కంపూడి సుజాత, కోశాధికారిగా శాంతిశ్రీ ఎన్నికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 87 వేలకుపైగా ఉన్న గెజిటెడ్ అధికారులలో 22 వేల మంది మహిళా అధికారులున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా జీ.దీపారెడ్డి మాట్లాడుతూ...ఈనెల 27న టీజీవో కార్యాలయం నందు బతుకమ్మ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, దీనికి మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతోపాటు పలువురు మహిళా ఐఏఎస్ అధికారిణిలు హాజరవుతారని తెలిపారు. అనంతరం ఈ వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను టీజీవో నాయకులు సత్యనారాయణ, బీ.శ్యామ్‌తోపాటు మహిళా అధికారులు శాంతిశ్రీ, శిరీష, రేవతి, అఈనిత, కవిత, లావణ్య తదితరులు ఆవిష్కరించారు.