22-09-2025 01:14:35 AM
ప్రారంభించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 25 వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మోదీ చిత్రపటాలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
నేడు ధన్యవాద్ మోదీ జీ పాదయాత్ర
ఇదిలా ఉంటే జీఎస్టీ స్లాబ్‌లను తగ్గిస్తూ చారిత్రక నిర్ణయాన్ని ప్రదాని మోదీ తీసుకున్న నేపథ్యంలో “ధన్యవాద్ మోదీ జీ” పాదయాత్రను నేడు చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా అశోక్‌నగర్ ఎక్స్ రోడ్ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్ హాజరుకానున్నారు.