07-01-2026 12:00:00 AM
బెజ్జంకి జనవరి 6: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులు గా దాచారం గ్రామ ఉప సర్పంచ్ దీటీ బాల నర్సు ను మండల కేంద్రంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా జెట్టి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి ,పుల్ల అనిత భీరయ్య,బుర్ర వినోద్,ప్రధాన కార్యదర్శి ఆడుకుని వీరేశం,సహాయ కార్యదర్శి గైనీ త్రిశూల్,సంయుక్త కార్యదర్శి టేకు జ్యోతి సంపత్, కోశాధికారి నాంపల్లి శంకర్,కార్యవర్గ సభ్యులు చాడగొండ పుష్పలత శ్రీనివాస్ రెడ్డి , గంగాధర రాజమల్లు లను ఎన్నుకున్నారు.
మండల ఫోరం అధ్యక్షుడిని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శాలువా కప్పి అభినందించారు.అంతరం బాల నర్సు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరితో కలసి మండల అభివృద్ధిలో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు.