06-12-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
చేర్యాల, డిసెంబర్ 5: సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ దాఖలు చేసేందుకు కేంద్రంలోకి ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాల నియోజకవర్గంలోని మద్దూరు, రెబర్తి, దూల్మిట్ట, భైరాన్ పల్లి, దూల్మిట్ట నామినేషన్ కేంద్రాలను సందర్శించి మండల ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల100 మీటర్ల వరకు ప్రజలు ఉండవద్దని ఆదేశించారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు అధిక సంఖ్యలో రావాల్సి వస్తే అందుకు సంబంధించిన వారికి టోకెన్స్ ఇవ్వాల్సిందిగా సభంధిత పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మద్దూరు దూల్మిట మండలములలో నామినేషన్ తీసుకునే సెంటర్స్ వద్ద ఎటువంటి సమస్య లేకుండా చూడాల్సిందిగా అక్కడి ఎంపీడీఓ, ఎంపీవో, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు.