16-08-2024 12:41:49 AM
హైడ్రా కమిషనర్‌ను ప్రశంసిస్తూ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పోస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): ‘మంచిపని చేస్తున్నారు.. శభాష్ రంగనాథ్.. గో అహెడ్..’ అని హైడ్రా కమిషనర్‌ను ప్రశంసిస్తూ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గురువారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పుడది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన పెట్టిన పోస్టు యథాతథంగా.. ‘మన ప్రజాప్రతినిధులు చాలామంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకొని అడ్డగోలుగా ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారు.
గత పాలకులు మేం తింటాం.. మీరూ తినండి అని అందరినీ దొంగలుగా మార్చింది. లక్షల కోట్ల భూములను, ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడుకొని భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి. సీఎం గారు హైడ్రాని ఇంకా బలోపేతం చేయండి. రాష్ట్రం మొత్తానికి హైడ్రాని విస్తరించడండి.. ప్రభుత్వ భూములను చెరువులను కాపాడండి. రంగనాథ్ గారికి పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. రంగనాథ్ గారు మనం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటమే కాదు ఉన్నట్టు కూడా నిరూపించుకోవాలి. మీకు ఇది పరిపాలన పరమైన సూచన.’ అని రాసిన తన పోస్టును తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీకు ఆకునూరి మురళి ట్యాగ్ చేశారు.