22-12-2025 02:35:17 AM
సమాన పనికి సమాన వేతనం సాధనే ఏకైక లక్ష్యం
ఉద్యోగులను ఏకం చేస్తాం: జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు
పులి లక్ష్మణ్
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 21 (విజయక్రాంతి): సమాన పనికి సమాన వేతనం సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఫిబ్రవరిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ‘చలో ఢిల్లీ’ నిర్వహించను న్నారు. రెండు లక్షల మంది ఉద్యోగులను ఏకం చేస్తామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమబాట పట్టారు.
రెండు లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ మేరకు ఆదివారం నాంపల్లిలో నిర్వహించిన తెలంగాణ రాష్ర్ట ఔట్‌సోర్సింగ్ జేఏసీ కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు. జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు పులి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్య లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ర్ట జేఏసీ బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించింది. అక్కడ జాతీయ స్థాయి నేతలను కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారు.
ఈ సందర్భం గా పులి లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. సమాన పనికి - సమాన వేత నం అమలు చేయడమే తమ జేఏసీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత, సం క్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అది నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. ఈ సమావేశానికి రాష్ర్ట నలుమూలల నుంచి జేఏసీ నాయకులు, కార్యవ ర్గ సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ర్ట స్థాయి వరకు ప్రతి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తప్పనిసరిగా జేఏసీ సభ్యత్వం తీసుకోవాలి. 2026 జనవరిలో జేఏసీ అధికారిక క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తారు. అదే సమయంలో జిల్లా, రాష్ర్ట స్థాయిల్లోనూ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. రెండు లక్షల మంది ఉద్యోగులు ఒక్కతాటిపైకి వచ్చేలా కార్యాచరణ రూపొందించారు. రానున్న రోజుల్లో భారీ ఉద్యమాలు చేపట్టనున్నారు. అన్ని డిపార్ట్‌మెంట్ల వారు జిల్లా, రాష్ర్ట కమిటీల్లో భాగస్వాములు కావాలి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించని పక్షంలో, కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఐక్య పోరా టంతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో జేఏసీ కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి సంతోష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.