22-12-2025 02:37:47 AM
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
తోటకూర వజ్రేష్ యాదవ్
మేడిపల్లి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని రాజీవ్ నగర్ ఫేస్ 2లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా, స్థలం ఉండి ఇండ్లు కట్టుకోలేని పేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం చేపట్టారని వజ్రేష్ యాదవ్ అన్నా రు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బొమ్మక్ కళ్యాణ్, దానగళ్ళ యాదగిరి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.