calender_icon.png 22 December, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామోజీ ఫిల్మ్‌సిటీని ప్రమోట్ చేస్తున్న విద్యాశాఖ!

22-12-2025 02:33:39 AM

  1. విద్యార్థులు సందర్శించొచ్చని ఉత్తర్వులు జారీ
  2. ఒక్కొక్కరికి రూ.వెయ్యి చెల్లించి జనవరి 2 తర్వాత వెళ్లేలా ఉత్తర్వులు
  3. విమర్శలకు దారితీస్తున్న అధికారుల తీరు

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ సం స్థను ప్రోత్సహించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీని పాఠశాల విద్యాశాఖ ప్రమోట్ చేసేలా చర్యలు కనబడుతున్నాయి. ప్రభుత్వ బడుల్లోని విద్యా ర్థులు రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించొచ్చని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఉపాధ్యాయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభు త్వం ఒక ప్రైవేట్ సంస్థను సందర్శించేలా ఆదేశాలు కూడా ఇస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.

ప్రతి స్కూల్ నుంచి వెళ్లే ఒక్కో విద్యార్థికి ప్రవేశ రుసుము రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుందని ఈ నెల 11న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఫిల్మ్‌సిటీని సందర్శించాలనుకునే హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు ముందస్తుగా ప్రత్యేకంగా స్కూల్స్ బుకింగ్ చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. 

ఇప్పుడిదే తీవ్ర చర్చకు దారితీస్తోంది. విజ్ఞానాన్ని నేర్పే ప్రాజెక్టులు, మ్యూజియంలు, పార్కులు, చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు విద్యార్థులను తీసుకెళ్లాలని ఆదేశాలివ్వకుండా ఇలా ఓ ప్రైవేట్ సంస్థను సందర్శించాలని ఉత్తర్వులు జారీచేయడంపై  విమర్శలు వినిపిస్తున్నాయి.