13-10-2025 01:36:40 AM
త్వరలోనే మంజూరయ్యే అవకాశం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, అక్టోబరు 12 (విజయ క్రాంతి): ఆయుర్వేదం ఏర్పాటులో కేంద్రం వెనుకంజ వేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందంటూ మీడి యా వస్తున్న కథనాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సమాచారం లీకులిస్తూ కేంద్రంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ, ప్రాంతాలూ సమానమేనని స్పష్టం చేశారు.ఎయిమ్స్ తరహాలో తెలంగాణలోనూ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయు ర్వేదను స్థాపించాలని కోరుతూ ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాసినట్లు బండి సంజయ్‌తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూ లంగా ఉందని, త్వరలోనే మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు సైతం సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌లో అత్యాధినుక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ దామోదర రాజనర్సింహకు తాను 4 నెలల క్రితమేలేఖ రాశానని, కానీ ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. కాగా అతి త్వరలోనే ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా, గోవా తరహాలోనే తెలంగాణలోనూ ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.