calender_icon.png 13 October, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

13-10-2025 01:38:12 AM

కార్యక్రమాన్ని తిలకించిన దివిటిపల్లి రైతులు, అధికారులు

మహబూబ్‌నగర్, అక్టోబర్ 12(విజయక్రాంతి):ప్రధానమంత్రి రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యో జన క్రింద వివిధ రకాల సంక్షేమ పథకాలను ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. అందు లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా స్థా యిలో జాతీయ పప్పు దినుసుల పథక ప్రారంభోత్సవాన్ని మహబూబ్ నగర్ అర్బ న్ మండలంలోని దివిటిపల్లి రైతు వేదికలో ప్రత్యక్షంగా వీక్షించారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్, స హాయ వ్యవసాయ సంచాలకులు రాంపాల్, మహబూబ్ నగర్ అర్బన్ మండల వ్యవసాయ అధికారి పి.శ్రీనివాసులు, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.