26-08-2025 01:48:42 AM
రెవెన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలి: జేఏసీ హెచ్చరిక
కొండపాక, ఆగస్టు 25,: చేర్యాల రెవిన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ రహదారి ముట్టడి హల్చల్ చేశారు. నాలుగు మండలాల నుంచి జేఏసీ నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా భారీగా ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రామాల వారీగా తగిన బుద్ధి చెప్తామని నేతలు హెచ్చరించారు. జేఏసీ చైర్మన్ వకుళాభరణం నరసయ్య పంతులు, చేర్యాల మున్సిపల్ చైర్మన్ అంకుల్ శ్రీధర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ముస్తాల బాల్ నరసయ్య, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూరుగు సురేష్ తదితరులు మాట్లాడుతూగత ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆరోపించారు.
ప్రజా అవసరాల దృష్ట్యా చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించడమే సముచితం అని డిమాండ్ చేశారు. అవసరమైతే జేఏసీ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ నాయకులు, మహిళలు, యువతతోపాటు చేర్యాల టౌన్, చేర్యాల రూరల్, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట తదితర మండలాల ప్రజలు పాల్గొన్నారు.