18-12-2025 01:34:32 AM
అయిజ, డిసెంబర్ 17: జోగులాంబ గద్వాల జిల్లా అయిజలోని ప్రభుత్వ కళాశాలను ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయ రాజు సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జనవరిలో జరిగే ఇంగ్లీష్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ మరియు వాటి నైతిక విలువలు పరీక్షలకు తప్పకుండా హాజరుకావాలన్నారు. ఫిబ్రవరిలో జరిగే ద్వితీయ సంవత్సర విద్యార్థుల సైన్స్ ప్రాక్టికల్స్ కు మరియు వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.
ప్రభుత్వం కల్పించిన వసతులను ఉపయోగించుకుని ఉత్తీర్ణత శాతం పెంచాలని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులను ఉద్దేశించి, త్వరగా పాఠ్యాంశాలను పూర్తిచేయాలని వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధ్యాపకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.