12-10-2025 12:56:44 AM
జిన్నారం, అక్టోబర్ 11 : సం గారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మా ణాలను అధికారులు శనివారం కూల్చివేశా రు. మున్సిపల్ కమిషనర్ కిషన్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి పోలీసుల బందోబస్తు మధ్య అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో కమర్షియల్, ఇతర భవనాలు నిర్మించే వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని, లేకుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.