12-10-2025 12:58:04 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఆర్జిత సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 11 (విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి. దేవస్థానం అనుబంధం ఆలయమైన భీమేశ్వర స్వామి దేవాలయంలో లాంచనంగా ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. నిత్య కల్యాణం, భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ భీమేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యే క పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయ న మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆల య అభివృద్ధి విస్తరణలో భాగంగా వచ్చే భక్తులకు భీమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది నవంబర్ ౨౦న రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. రూ.౪౨ కోట్లతో రోడ్డు వెడల్పు, రూ.౭౬ కోట్లతో ప్రస్తుతం ఆలయ విస్తరణ చేస్తున్నామన్నారు.
రాజన్న ఆలయంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో స్వామి వారికి ఏకాంత సేవలు యధావిధిగా జరుగుతాయన్నారు. వేములవాడను టెంపు ల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో పరిరక్షణ కమిటీ సభ్యుల సూచనల సలహాలు తీసుకొని ముందుకు పోతు న్నామన్నారు.