calender_icon.png 31 January, 2026 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాల మార్కెట్‌లో కూల్చివేతలు

04-10-2024 12:32:37 AM

అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారుల చర్యలు 

మంచిర్యాల, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మంచిర్యాల ప్రధాన మార్కెట్‌లోని అక్రమ కట్టడాలను గురువారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన, రోడ్డుపై రేకులు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి గతంలోనే నోటీసులు జారీ చేశారు. స్పందన లేకపోవడంతో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మార్కింగ్ చేసి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆక్రమణలను తొలగించారు.

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రధాన మార్కెట్‌ను పరిశీలించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుధాకర్ కొంత సమయం ఇవ్వాలని మరోమారు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. గతం నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదని, మార్కెట్ మొత్తంలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా తొలగింపులుంటాయని అధికారులు హెచ్చరించారు.