31-01-2026 02:22:23 AM
నిబంధనలు తుంగలో తొక్కిన ఆరు దిగ్గజ ఫర్నిచర్ షోరూంలు సీజ్
హైదరాబాద్ సిటీ బ్యూరో జనవరి 30 (విజయక్రాంతి): భాగ్యనగరంలో అగ్నిప్రమాదాల నివారణే లక్ష్యంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్ రెండో రోజు మరింత ఉధృతమైంది. అగ్నిమాపక నిబంధనలను బేఖాత రు చేస్తూ, వేలాది మంది ప్రాణాలను ఫణం గా పెడుతున్న బడా వ్యాపార సంస్థలపై అధికారులు కొరడా ఝులిపించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖలతో కలిసి గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అత్తాపూర్, నాగోల్, కొంపల్లి ప్రాంతాల్లో హైడ్రా సంయుక్త తనిఖీలు నిర్వహించింది. ఆరు ప్రముఖ ఫర్నీచర్ షోరూంలను అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేని భవనాలు, సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ప్రమాదకర వస్తువులను చూసి అధికారులు విస్తుపోయారు.
పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను గోదాములుగా మార్చి, అక్కడ అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్, పెయింట్ డబ్బా లు, పరుపులు, బ్యాటరీలను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తిం చారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, చిన్న నిప్పురవ్వ తగిలినా క్షణాల్లో భవనం మొత్తం అగ్నిగుండంగా మారే పరిస్థితి ఉంది. ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకోకుండా ఏళ్ల తరబడి వ్యాపారాలు సాగి స్తున్నట్లు నిర్ధారించారు. రాబోయే రోజుల్లో అన్ని వాణిజ్య సముదాయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని, అధికారులు పేర్కొ న్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులు హెచ్చరించారు.