31-01-2026 01:57:08 AM
హైదరాబాద్, జనవరి 30 (విజయ క్రాంతి): టీజీ ఎప్‌సెట్, పీజీఈసెట్, పీఈసెట్ షెడ్యూళ్లు విడుదలయ్యాయి. శుక్ర వారం సెట్స్ కమిటీల సమావేశాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో, జేఎన్టీయూలో అధికారులు నిర్వహించి, షెడ్యూళ్లను ఖరారు చేశారు. 2026-27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 4 చివరి తేదీ. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఎప్‌సెట్‌కు రెండు, మూడు విడతల్లో మాక్ కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నారు.
పీజీ ఈసెట్ షెడ్యూల్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం ఆర్క్ కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 23న జారీ చేయనున్నారు. అదే నెల 27 నుంచి దరఖాస్తులను స్వీరిస్తారు. ఎలాంటి అప రాధ రుసుము లేకుండా దరఖాస్తు స్వీకరణకు మే 6 చివరి తేది. పరీక్షలను మే 28 నుంచి 31 వరకు నిర్వహిస్తారు.
పీఈసెట్ షెడ్యూల్: బీపీఈడీ, డిపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే పీఈసెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 25న విడుదల చేస్తారు. మార్చి 2 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎలాం టి అపరాధ రుసుములేకుండా మే 5 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువిచ్చారు. అపరాధ రుసు ముతో మే 20 చివరి తేది. మే 31 నుంచి జూన్ 3 వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్స్ టెస్టులను నిర్వహిస్తారు.
ఎప్‌సెట్ పరీక్షలు..
* మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ
* మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్
పీజీఈసెట్ పరీక్షలు..
* మే 28 నుంచి 31 వరకు
పీఈసెట్ పరీక్షలు...
* మే 31 నుంచి జూన్ 3 వరకు