23-05-2025 01:15:27 AM
మేడ్చల్, మే 22(విజయ క్రాంతి): మే డ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్ లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 24 గంటల్లోనే యాక్షన్ పూర్తి చేశారు. పర్వతాపూర్ సర్వే నెంబర్ 1 లో ము స్లిం క్రిస్టియన్ స్మశాన వాటికలు ఆక్రమణకు గురయ్యాయని స్థానికులు హైడ్రాకు ఫిర్యా దు చేశారు దీంతో స్వయంగా రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలు పరిశీలిం చారు.
సమస్య పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే సిఐ సైదులు ఆధ్వర్యంలో జెసిబి లతో సిబ్బంది అక్కడికి చేరుకొని ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు ఆ తర్వాత అక్రమ నిర్మాణాల ను కూల్చివేశారు. మూడు షాపులతోపాటు 15 ఫ్లాట్లకు వేసిన పునాదులు, రెండు మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రహరీలను, అందులో వేసిన షెడ్డులను తొలగించారు.
కోర్టు కేసులు ఉన్నాయని ప్రచారం
ఒక వ్యక్తి సర్వే నెంబర్ 12 లో సొంత భూ మిలో వెంచర్ వేశారు. పక్కనే ఉన్న ఒకటో సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిని కూడా కలుపుకున్నారు. అందులోకి వెళ్లకుండా కో ర్టు కేసులు ఉన్నాయని ప్రచారం చేశారు. 15 ప్లాట్ల ప్రహరీ ల మీద తప్పుడు రిట్ పిటిషన్ నంబర్లు రాయించారు. పక్కన ఉన్న సర్వే నంబర్ వేసి అనుమతులు తీసుకోవడంలో అప్పటి పాలకవర్గం సహకరించిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు.
ప్రజావాణిలో వ చ్చిన ఫిర్యాదు మేరకు గూగుల్ మ్యాప్స్, ఎన్ ఆర్ ఎస్ సి ఇమెజీలు, రెవెన్యూ రికార్డు ల ఆధారంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.రెవెన్యూ అధికారులతో, స్థానికులతో విచారించి ప్రభుత్వ స్థలమేనని నిర్ధా రించుకున్నారు. ఆ తర్వాతే కూల్చివేతలకు పూనుకున్నారు. ఇది ప్రభుత్వ స్థలమని తెలిసినా ఒక వ్యక్తి 200 గజాల ప్లాట్ కొని షా పులు నిర్మించి అద్దెకు ఇచ్చాడు.
ప్రతినెల వాటిపై 50 వేల రూపాయలకు పైన అద్దె పొందుతున్నాడు. ఏడేళ్లుగా ధర్నాలు చేశామని, అధికారుల చుట్టూ తిరిగామని స్థాని కులు తెలిపారు. ఆక్రమణలు తొలగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.