17-07-2025 01:49:37 AM
- ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి
- 23న విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
ఖైరతాబాద్, జూలై 16 (విజయక్రాంతి) ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేయాలని అన్నారు.
ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ, పుట్ట లక్ష్మణ్ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, అశోక్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అనిల్, నాగరాజు తదితరులు హాజరై మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రి నియమించకుండా పరిపాలనలో కొనసాగించడం విచారకరమని అన్నారు.
తద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బడ్జెట్లేమిటో సమస్యలు విలేఖనం చేస్తున్నాయని ఆరోపించారు. ఎలక్షన్ డిక్లేషన్లో విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వం మాదిరిగానే ఏడు శాతం మించి బడ్జెట్ కేటాయింపులు జరపలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఎండగట్టేందుకు జూలై 27న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బందుకు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ బంద్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐడిఎస్‌ఓ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నితీష్, ఏఐపిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.