05-11-2025 01:03:47 AM
ప్రభుత్వాసుపత్రిలో పేద రోగులకు అందని వైద్యం
ఖానాపూర్, నవంబర్ 4 (విజయక్రాం తి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు వెక్కిరిస్తున్నాయి. దినదినం ఆసుపత్రిలో ఓపి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని వైద్య సౌకర్యాలు ఉండాల్సి న ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా దంత వైద్యం బీదలకు అందకుండా పోయిం ది. కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఈ వైద్య పోస్టు ఖాళీ గా ఉండగా ఇటీవల ఉట్నూర్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వైద్యుడు కొద్ది రోజులు ఇక్క డ పని చేసినా తిరిగి తన స్వస్థలానికి వెళ్లిపోవడంతో ఇక్కడ ఈ సేవలు ప్రజలకు అం దరిని ద్రాక్ష లాగే మారింది .
కాగా పరికరాలు కూడా పనికిరాకుండా పోవడంతో వాటిని ఆసుపత్రిలో ఓ మూలన పడేశారు. చేసేది లే క ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇతర సేవలో వైద్యు లు అందుబాటులో ఉన్నప్పటికీ, దంత వైద్యం మాత్రం అందడం లేదని ప్రజా సం ఘాలు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయమై ఆసుపత్రి సూపరిం డెంట్ వంశీని.. ‘విజయక్రాంతి’ వివరణ కోర గా మొన్నటి వరకు వైద్యుడు ఉన్నాడని, తన స్వస్థలానికి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది. వైద్యులకు గదులు సరిపోకపోవడం వల్ల డెంటల్ మిషన్‌ని ఒకపక్క పెట్టినట్లు అది కూడా పని చేయడం లేదని తెలిపారు. ఈ మేరకు పైఅధికారులకు విన్నవించినట్లు తెలిపారు.