calender_icon.png 5 November, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

05-11-2025 01:05:35 AM

సింగరేణి ఏరియా జీఎం రాధాకృష్ణ 

మందమర్రి, నవంబర్ 4 : ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా ఒక్కో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ కోరారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణలో సింగరేణి విద్యార్థులతో కలిసి మంగళవారం వివిధ రకాల పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడ మొక్కల మీద ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాం సుందర్, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి జా, డీజీఎం ఈ&ఎం దూప్ సింగ్, డీజీఎం ఎఫ్ అండ్ ఏ ఆర్విఎస్‌ఆర్కె ప్రసాద్, సివిల్ ఎస్‌ఈ రాము, విద్యార్థులు పాల్గొన్నారు.