10-05-2025 06:16:40 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని నర్సాపూర్ మండల కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి కాలపు క్రీడా శిబిరాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు శనివారం సందర్శించారు. శిబిరంలో పిల్లలకు ప్రతిరోజు ఆటలు పాటలు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని దీన్ని సద్వినించుకోవాలన్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.