calender_icon.png 11 May, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీ గౌస్ ఆలంను కలిసిన ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు

10-05-2025 11:33:30 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు శనివారం కరీంనగర్ సిపి గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా భారీ సంఘీభావ ర్యాలీ కలెక్టరేట్ నుండి అమరవీరుల స్థూపం వరకు నిర్వహిస్తున్నామని దీనికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, తమరు కూడా ర్యాలీకి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సర్దార్ హర్మేందర్ సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.