10-05-2025 10:48:18 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో రైతులు పండించిన పంటలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ఆరబెట్టిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న రైతులు శనివారం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఆరబెట్టిన రైతుల ధాన్యాన్ని సకాలంలో కొడుకే కొనుగోలు కేంద్రాల వారు సేకరించకపోవడంతో వారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలను రోజుల తరబడి నిర్లక్ష్యం చేయడంతో ఆగ్రహించిన రైతన్నలు ధర్నాలో వినూత్న స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యాన్ని తరుగు పేరుతో రైస్ మిల్లర్లు చేయించడం లేదని సాకు చెప్పడంతో రైతన్నలు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని రైతులను సముదాయించడంతో కొనుగోలుపై భరోసా ఇవ్వడంతో రైతుల ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.