10-05-2025 10:55:25 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కేంద్రం అనుమతిస్తే పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటారని రిటైర్డ్ మాజీ హవల్దార్ భిక్కనూర్ పట్టణానికి చెందిన రాయిలాపురం స్వామి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 2001 నుండి 2018 వరకు ఆర్మీలో జమ్మూ, శ్రీనగర్ తో పాటుగా పలు ప్రదేశాల్లో పనిచేసిన అనుభవం ఉందని, కేంద్రం అనుమతిస్తే వెంటనే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించాడు. నాతోపాటు మా భిక్కనూరు మండలానికి చెందిన యువకులు మేము కూడా అవకాశం వస్తే మేము కూడా యుద్ధంలో పాల్గొంటామని యువకులు ముక్తకంఠంతో చెప్తున్నారన్నారు.