calender_icon.png 30 January, 2026 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యో రక్షతి రక్షితః

30-01-2026 06:27:57 PM

డిఎస్పి శ్రీనివాసరావు 

మర్రిగూడ,(నాంపల్లి),(విజయక్రాంతి): నాంపల్లి మండలం పెద్దాపురం ప్రభుత్వ ఆదర్శ పాఠశాల 10వ  తరగతి విద్యార్థులకు పిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు శుక్రవారం అందజేశారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ధర్మో రక్షతి రక్షితః,  వృక్షో రక్షతి రక్షితః  ఇంతకు ముందు లేని కొత్త పదం విద్యో రక్షతి రక్షితః అంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడోద్దని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యను సరియైన ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్లాలని విద్యార్థులకు తెలియజేశారు.

పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు విద్యార్థుల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇలాంటివారు అరుదుగా ఉంటారని వారి శ్రమను వారి పట్టుదలకు ప్రతిఫలంగా విద్యార్థులు మంచి ఫలితాలతో వారికి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావును అభినందించారు. గతంలో చదువుకునే సమయంలో పాఠశాలలో కనీస వసతులు కూడ లేవని ఐన కష్టపడి ఈ స్థాయికి చేరామని, క్రమశిక్షణతో చదివిన చదువు ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానానికి  చేరుస్తుందని తెలిపారు.   ఇప్పుడు కష్టపడి చదివి తేనే మంచి ఫలితాలు వస్తాయని లక్ష్యం పెట్టుకుంటేనే భవిష్యత్తులో సంతోషంగా గౌరవంగా ఉంటామని ఆయన   విద్యార్థులకు సూచించారు.

అనంతరం పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు మాట్లాడుతూ... విద్యార్థులు బాగా చదివి మండల  జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు   ఈ కార్యక్రమంలో నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు  పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి  వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఆంజనేయులు రఘునందన్ సుమలత బాల లింగమ్మ కోటేష్ ఉపాధ్యాయులు  విద్యార్థులు పాల్గొన్నారు