calender_icon.png 23 May, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26న ఖానాపూర్‌కు డిప్యూటీ సీఎం భట్టి

23-05-2025 01:01:00 AM

తలకొండపల్లి,మే 22: కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని ఖానా పూర్ గ్రామానికి ఈనెల 26న డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం నియోజకవర్గానికి మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులకు డిప్యూ టీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ సర్వే నెంబరు 256 లో 25 ఎకరాల్లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ శంకుస్థాపన పనులను స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాపును పరిశీలించి సభ ఏర్పాట్ల గురించి అధికారుల చర్చించి పలు సలహాలు సూచనలు చేశారు.

డిప్యూటీ సీఎం రానుండడంతో ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా  చర్యలు చేపట్టాలన్నారు. ఇదే సర్వేనెంబర్లో నూతన సబ్స్టేషన్ నిర్మాణ పనులు కూడా చేపట్టనుండడంతో సంబంధిత శాఖ అధికారులు ఏ ర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ నాగార్జున, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు.