calender_icon.png 23 May, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

23-05-2025 12:57:40 AM

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

నిజాంసాగర్ మే 22(విజయక్రాంతి ): పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు గైనీ రమేష్ , గైనీ ప్రకాష్, గుడి తండాకి చెందిన హెచ్.బాల్ సింగ్ గజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే  వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  చేస్తున్న కృషి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  అభివృద్ధి కార్యక్రమా లకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతు న్నట్లు వారు తెలిపారు. కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి, బొడ్ల రాజు పాల్గొన్నారు.