calender_icon.png 14 August, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగెం వద్ద మూసీ వరద ఉధృతిని పరిశీలించిన సీపీ సుధీర్‌బాబు

14-08-2025 12:28:21 AM

వలిగొండ, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాబోయే 72 గంటల పాటు భారీ వర్షాలు నేపథ్యంలో యాదాద్రి భువనగిరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో సీఎం ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిపి సుధీర్ బాబు అన్నారు. బుధవారం వలిగొండ మండలంలోని సంగెం గ్రామం వద్ద గల మూసీ వరద ఉధృతిని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగెం  మూసీ కాజువేలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకులు తొలగించడం జరిగిందని ప్రస్తుతం వరద సాఫీగా సాగుతుందని అన్నారు. వరద ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రజలు, వాహనదారులు, పశువుల కాపర్లు ప్రయాణాలు సాగించవద్దని అన్నారు.

వరద ప్రాంతాల్లో సిబ్బంది నియమించడం జరిగిందని, ప్రజలు యూనిఫామ్ లేని బాధ్యతా యుత పౌరులుగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలు పాత ఇండ్లలో ఉండరాదని కూలిపోయే ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు.

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నామని ప్రజల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపి మధుసూదన్ రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ యుగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.