calender_icon.png 14 August, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే సమీక్ష

14-08-2025 12:27:39 AM

నారాయణఖేడ్, ఆగస్టు 13:  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు  ఎదురవ్వకుండా చూసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాన్ని బట్టి బిల్లులను వారి అకౌంట్ లలో జమ చేయాలని తెలిపారు.

సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ఇండ్ల నిర్మాణానికి ఆటాంకం ఏర్పడుతుందని, అలాంటి వాటిని వెంటనే పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతి రావు, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, హౌసింగ్ డీఈ సతీష్ తివారి, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, వంశీ,  మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, న్యాయవాది సంగన్న, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి పాల్గొన్నారు.