calender_icon.png 21 November, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించాలి

21-11-2025 07:15:36 PM

నకిరేకల్,(విజయక్రాంతి): బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి బడిలో చేర్పించాలని జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మొదటి రోజు సమావేశం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం.చర్మరాజు అధ్యక్షతన నిర్వహించారు. విద్యార్థుల ప్రగతి, ఎఫ్ ఎల్ ఎస్ ప్రోగ్రాంను సఫలం చేయాలని అయన కోరారు.

2026 ఫిబ్రవరిలో నిర్వహించే మూడవ తరగతి ప్రగతిలో ప్రతి విద్యార్థి ని సంసిద్ధం చేయాలని  బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించాలని ఆయన కోరారు. వర్క్ బుక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయనసూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు సైదులు బాలాజీ శేషగిరి మండల స్థాయి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.