24-05-2025 12:48:17 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
26న ఖానాపూర్‌లో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ఆమనగల్లు: కల్వకుర్తి అభివృద్ధే నా లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం అయన మాట్లాడారు. నియోజకవర్గం కు 8 విద్యుత్ సబ్ స్టేషన్లు, 300 ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఈనెల 26న తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ సమీపంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ చేస్తారని ఆయన పేర్కొన్నారు. కేఎల్‌ఐ ద్వారా ఆగస్టు నెలలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు. నియో జకవర్గంలోని పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించినట్లు చెప్పారు.
గత ప్రభుత్వం నియోజకవర్గంలో రోడ్లు, విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నియోజకవర్గంలో 600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసినట్లు, మరో 400 కోట్ల రూపాయలు అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎలాంటి వివక్ష పాటించలేదని అర్హులైన నిరుపేదలకి కేటాయించామని ఆయన పేర్కొన్నారు. త్వరలో తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ సమీపంలో 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
మీడియా అసత్య ప్రచారం మానుకోవాలి
కల్వకుర్తి నియోజకవర్గంలో తనకు ఏఐసిసి కార్యదర్శి వంశీ చందర్‌రెడ్డికి ఎలాంటి గొడవలు, గ్రూపులు లేవని అందరం కాంగ్రెస్ పార్టీ సభ్యులమేనని ఎమ్మెల్యే చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని తప్పుడు ప్రచారాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. సమావేశంలో కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.