27-11-2025 10:28:21 PM
భీమినీ (విజయక్రాంతి): భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డిప్యూటీ డి ఎం అండ్ హెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సి యొక్క రికార్డ్స్, మందులు, ఇమ్యునిస్టేషన్ రూమ్ తనిఖీ చేశారు. అనంతరం మీటింగ్లో పాల్గొని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ మీటింగ్ లో డాక్టర్ అనిల్ కుమార్ సిహెచ్ ఓ పుట్ట సత్తయ్య, సిహెచ్ఓ జలపతి, హెల్త్ అసిస్టెంట్ ఉమా శంకర్, ఎమ్మెల్ హెచ్ పి ఎస్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.