calender_icon.png 28 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను ఆకట్టుకుంటున్న గిరిజన మ్యూజియం

27-11-2025 10:26:19 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో పాత తరం గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు, వస్తువులు చూపరులకు కనువిందు కలిగేలా ఉన్నాయని గ్రామపంచాయతీ ఎన్నికల పరిశీలకులు. గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రెటరీ సర్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి మ్యూజియంలోని ప్రతి కళాఖండాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆర్చరీ కోర్టు చాలా బాగుందని కానీ బాణాలు వేయడానికి వచ్చే పర్యాటకులకు చిన్న పిల్లలకు పెద్దలకు వేరువేరుగా కొలతలు పెట్టి స్టేజి రూపంలో కట్టాలని అలాగే చిన్న పిల్లలు బోటింగ్ చేసే కొలను డిజైన్ మార్చాలని అన్నారు.

మ్యూజియం సందర్శించడానికి వచ్చే యాత్రికులకు మ్యూజియం ఎంట్రెన్స్ లోనే వివిధ కళాఖండాలతో తోరణం లాంటిది ఏర్పాటు చేయాలని, అలాగే యాత్రికులు బస చేయడానికి సపరేట్ గదిని ఏర్పాటు ఏర్పాటు చేయాలని అన్నారు. మ్యూజియం ఆవరణలో నిర్మించిన పాతకాలపు ఇండ్లు గిరిజన తెగల వారిగా వారి సంస్కృతికి తగ్గట్టు డిజైన్ చేయాలని అన్నారు. చిన్నారులకు ఆటవిడుపుగా క్రీడాస్థలం, యువకుల కోసం బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం చాలా బాగుందని అన్నారు.

మ్యూజియమును పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి సందర్శించే విధంగా ఇంకా కొత్త రకం డిజైన్లు రూపొందించాలని, సందర్శనకు వచ్చే పర్యాటకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని వారికి తగ్గట్టు అభివృద్ధిని బట్టి మ్యూజియంలో కళాఖండాలు పొందుపరచాలని అన్నారు. అనంతరం మ్యూజియం సంబంధించిన మెమొంటోను అడిషనల్ సెక్రెటరీకి అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఎస్ఓ ప్రభాకర్, ఏ టి డి ఓ చంద్రమోహన్, మేనేజర్ ఆదినారాయణ, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి, సహాయకులు రాందాస్, పోశాలు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.