calender_icon.png 15 November, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖనిజ సంపద కోసం ఆదివాసీలపై విధ్వంసం

10-08-2024 04:21:35 AM

ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక సభలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): అటవీ ప్రాంతంలో లభించే ఖనిజ సంపద కోసమే ఆదివాసీలపై మారణహోమం, విధ్వంసం సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో కూడా విధ్వంసం కొనసాగడం విచారకరమని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్స వాన్ని పురస్కరించుకొని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ‘ఆదివాసీ హక్కులు కార్పొరేటీకరణ సంఘీ భావ ఉద్యమాలు’ అనే అంశంపై బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండ్రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.

ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత లేని స్వరాజ్యాన్ని స్వాతంత్య్రం అనలేమని గాంధీజీ చెప్పారని గుర్తు చేశారు. పాలకులు అత్యాశతో వారి జీవన విధానంపై విధ్వం సం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులను కాపాడుతున్న వారిపైనే నిర్బం ధం కొనసాగడం బాధాకరమన్నారు. ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి, ప్రముఖ గాంధేయవాది హిమా న్షు కుమా ర్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మాడభూషి శ్రీధర్, నర్సింహారెడ్డి, ఎమ్మె ల్సీ వెంకటేశ్వరరావు, లక్ష్మణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.