10-08-2024 04:23:10 AM
రాష్ట్ర మంత్రులు దామోదర, ఉత్తమ్
చార్మినార్, ఆగస్టు 9: సెట్విన్ సంస్థకు గొప్ప చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్‌కు నూతన చైర్మన్‌గా నియమితులైన ఎన్.గిరిధర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతల స్వీకరణ చేపట్టగా ఈ కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీయువకుల కోసం ఏర్పాటు చేసిన సెట్విన్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. జంటనగరాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 1978లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డి మంచి ఆశయంతో సెట్విన్ సంస్థను స్థాపించారన్నారు.
రాష్ట్రంలో సెట్విన్ బస్సులను ఇతర ప్రాంతాలకు విస్తరించే కార్యక్ర మానికి తమవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం సెట్విన్ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ సేవలను విస్తరిస్తామన్నారు. త్వరలోనే జహీరాబాద్, తాండుర్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో సెట్విన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్‌రావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జహీరాబాద్ సీనియర్ నాయకుడు ఉజ్వల్‌రెడ్డి, ఫహీం, మహ్మద్ అజారుద్దీన్, సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ సురేష్‌బాబు, లీగల్ సలహాదారుడు మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.