calender_icon.png 26 January, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల కోసం ఐక్యపోరు

26-01-2026 01:46:08 AM

  1. మహిళా హక్కులు ఏలికల భిక్ష కాదు.. పోరాటాల ఫలితం
  2. ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కావొద్దు
  3. ఐద్వా జాతీయ మహాసభల స్వాగత సంఘం అధ్యక్షురాలు, ప్రొఫెసర్ శాంతా సిన్హా 
  4. భాగ్యనగరంలో ఐద్వా 14వ జాతీయ మహాసభలు ప్రారంభం

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 25 (విజయక్రాంతి):  ‘పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు.. పని ప్రదేశం నుంచి వీధి వరకు.. మన హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం’ అని మహిళలకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ మహాసభల స్వాగత సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి.  బస్ భవన్ పక్కన ఉన్న గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ముందుగా వేలాదిగా తరలివచ్చిన మహిళలతో హైదరాబాద్ వీధుల్లో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు.  అనంతరం మహాసభలకు ఫ్రొఫెసర్ శాంతా సిన్హా అధ్యక్షత వహించి ఐద్వా జాతీయ నేత బృందాకరత్‌తో కలిసి స్వాగత ఉపన్యాం చేశారు.  రాజ్యాంగం కల్పించిన హక్కులు,  అనుభవిస్తున్న స్వేచ్ఛ ఏలికలు వేసిన భిక్ష కాదు.. అవి తరతరాలుగా మహిళలు చేసిన అలుపెరగని పోరాటాల ఫలితం అని తెలిపారు.

ఆ పోరాట వారసత్వాన్ని అంది పుచ్చుకుని, కార్పొరేట్ విధానాలు, పితృస్వామ్య భావజాలంపై మరో సమరానికి సిద్ధం కావాలని ప్రొఫెసర్ శాంత సిన్హా పిలుపునిచ్చారు.  బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య అణచివేతకు వ్యతి రేకంగా సాహసోపేతమైన పోరాటాలు చేసిన గడ్డ ఇదని కొనియాడారు. మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మంత్రాల రాములమ్మ వంటి వీరనార్ల త్యాగాలు, కొమ్మరాజు అచ్చమాంబ, మోటూరు ఉదయమ్ వంటి నేతల సేవలు నేటికీ స్ఫూర్తిదాయకమ్కన్నారు. 

ఓటు ఆత్మగౌరవానికి ప్రతీక

దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర మారుతోందని, 2024 ఎన్నికల్లో 19 రా ష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని  శాంత సిన్హా గణాంకాలతో వివరించారు. అయితే, రాజకీయ పా ర్టీలు మహిళలను కేవలం ఒక ఓటు బ్యాంకు గా, తాయిలాలతో కొనుగోలు చేసే వస్తువుగా చూస్తున్నాయన్నారు. మనం అమ్ము డుపోయే వస్తువులం కాదు. మన ఓటు మన ఆత్మగౌరవానికి ప్రతీక. మన భాగస్వా మ్యం న్యాయం కోసం, హక్కుల కోసం ఉం డాలి, అని   స్పష్టం చేశా రు. కేంద్ర విధానాలపై ఆమె నిప్పులు చెరిగారు.  గ్రామీణ మహిళల ఆర్థిక వెన్నెముకైన ఉపాధి హామీ చట్టాన్ని విక్షిత్ భారత్ గ్యారెంటీ పేరుతో నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.