20-10-2025 12:00:00 AM
దేవరకద్ర కు రైల్వే సబ్ వే మంజూరు
ఎమ్మెల్యేను సన్మానించిన పట్టణవాసులు
దేవరకద్ర అక్టోబర్ 19: పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల దేవరకద్ర పట్టణం రెండుగా చీలి, సామాన్య ప్రజలకు రాకపోకలతో పాటు వ్యాపారాలు కుంటుబడడం, రైల్వే గేట్ ఉండడం వల్ల తరచుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సబ్ వే నిర్మించాలంటూ దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ అనేకసార్లు రైల్వే అధికారులను కలిసి విన్నవించారు,
ఇటీవల దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తాజాగా మరోసారి ఈ నెల 14న రైల్వే డిప్యూటీ మేనేజర్ ని కలిసి సమస్య ను మరోసారి కూలంకషంగా వివరించడంతో, సానుకూలంగా స్పందించిన రైల్వే డిప్యూటీ మేనేజర్ రైల్వే సబ్ వే మంజూరు చేశామని దేవరకద్ర ఏం ఎల్ ఏ మధుసూదన్ రెడ్డి కి ఫోన్ చేసి తెలియజేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవరకద్ర పట్టణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్ కి దేవరకద్ర పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేసి, సన్మానించారు.