20-10-2025 12:00:00 AM
దేవరకద్ర, అక్టోబర్ 19: సంగారెడ్డిలో జరిగిన ఎస్జిఎఫ్‌ఐ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో దేవరకద్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి జి. వికాస్ (9వ తరగతి) జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థికి, ప్రోత్సా హం అందించిన వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రధానాచార్యు లు డి.శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో విజయం సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.